శ్రీ కాలభైరవ స్వామి పవిత్ర క్షేత్రం

ఓం శ్రీ కాలభైరవాయ నమః

13వ శతాబ్దపు ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక — ఇసన్నపల్లిలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం. కాశీ క్షేత్రం తరువాత దక్షిణ భారతదేశంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అంకితమైన ఏకైక దేవాలయం. 

మీ దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి

దర్శన సమయాలు

మంగళవారం, శనివారం, ఆదివారం

ఉదయం 5:00 నుండి రాత్రి 8:00 వరకు

సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం

ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు
సాయంత్రం 4:00 నుండి రాత్రి 8:00 వరకు

కాశీ క్షేత్రం తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం.
మీ సందర్శనను ప్లాన్ చేసుకోండి

దర్శన సమయాలు & నిత్య సేవలు

భక్తులు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు అవసరమైన ముఖ్యమైన దర్శన వివరాలు మరియు సేవా సమాచారం. 

దర్శన సమయాలు

శ్రీ కాలభైరవ స్వామివారి దర్శనానికి మంగళవారం అత్యంత పవిత్రమైన, శుభప్రదమైన రోజు.

రోజులు
దర్శన వేళలు
మంగళవారం,
శనివారం,
ఆదివారం
ఉదయం 5:00 – ఉదయం 8:00
సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం
 ఉదయం 5:00 – మధ్యాహ్నం 1:00
సాయంత్రం 4:00 – రాత్రి 8:00

రోజువారీ పూజలు మరియు సేవలు

రోజువారీ పూజా కార్యక్రమాల పట్టిక మరియు ఆచారాల వివరాలు

నిత్య పూజలు & సేవలు

రోజువారీ పూజా కార్యక్రమాలు మరియు సేవల వివరాలు
దర్శన వేళలు
ఉదయపు పూజ

అభిషేకం • హారతి • మంత్రపుష్పం • త్రిధా ప్రసాద వితరణ

ఉదయం 7:00 – 8:00
మధ్యాహ్న పూజ

సేవలు: అభిషేకం • సిందూరార్చన • హారతి • నివేదన • మంత్రపుష్పం • త్రిధా ప్రసాద వితరణ

మధ్యాహ్నం 12:00 – 1:00
సాయంకాల పూజ

హారతి • అష్టోత్తర నామార్చన • మంత్రపుష్పం • త్రిధా ప్రసాద వితరణ

సాయంత్రం 7:00 – 8:00
ప్రత్యేక పూజలు & సేవలు

శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయ చరిత్ర – మహిమ, వైభవం

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, ఇసన్నపల్లి గ్రామంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం సుమారు 13వ శతాబ్దానికి చెందిన ప్రాచీన పుణ్యక్షేత్రం. డోమకొండ సంస్థాన పాలకుల ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ ఆలయం, శివుని ఉగ్రరూపమైన శ్రీ కాలభైరవ స్వామివారికి అంకితమైన అరుదైన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

ఆలయంలోని మూలవిరాట్టు శతాబ్దాల నాటి శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తూ, ఈ క్షేత్రం యొక్క చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను చాటుతోంది. స్థానిక స్థలపురాణం ప్రకారం అష్టభైరవులు ఎనిమిది దిక్కులను పరిరక్షిస్తుండగా, శ్రీ కాలభైరవ స్వామివారు ఈశాన్య దిక్కుకు అధిపతిగా కొలువై భక్తులను కాపాడుతున్నారని విశ్వాసం.

శ్రీ కాలభైరవ స్వామివారు కాలానికి అధిపతి, ధర్మ పరిరక్షకుడు, భయాలను తొలగించి అభయాన్ని ప్రసాదించే దైవంగా ఆరాధించబడుతారు. గ్రహదోషాలు, శని సంబంధిత సమస్యలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, విజయాలు కలుగుతాయని నమ్మకంతో ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనల కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవం శ్రీ కాలభైరవ స్వామివారి జయంతి, ఇది కార్తీక బహుళ అష్టమి నాడు ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక హోమాలు, మహాపూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. శతాబ్దాల చరిత్ర, విశిష్ట సంప్రదాయాలు, అపారమైన ఆధ్యాత్మిక మహిమతో ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి చిరస్థాయిగా నిలిచిన పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

శ్రీ కాలభైరవ స్వామివారికి మంగళవారం అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మిగిలిన అన్ని రోజుల్లో ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది.

13వ శతాబ్దపు పవిత్ర వారసత్వం
ఇసన్నపల్లి, తెలంగాణ
ప్రతి మంగళవారం విశేష ఆరాధన

ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో మీ వంతు సహకారాన్ని అందించి భాగస్వాములు కండి.

శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ప్రశాంతమైన దర్శన వాతావరణం కల్పించేందుకు ఈ క్రింది అభివృద్ధి పనులు అవసరం.

ప్రాధాన్య అభివృద్ధి కార్యక్రమాలు
స్నాన గదులునిర్మాణం: ప్రథమ ప్రాధాన్యత

బావి సమీపంలో భక్తుల సౌకర్యార్థం మహిళలు, పురుషులకు ప్రత్యేక స్నాన గదులు, మరుగుదొడ్లు మరియు దుస్తులు మార్చుకునే గదులు.

తాగునీటి సౌకర్యాల అభివృద్ధి: ప్రథమ ప్రాధాన్యత

భూగర్భ జలమట్టం తగ్గుతున్న నేపథ్యంలో అదనపు బోర్లు, నీటి నిల్వ ట్యాంకులు మరియు శాశ్వత నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు.

వంటశాల అభివృద్ధి: ప్రథమ ప్రాధాన్యత

అన్నదాన కార్యక్రమాలు, నిత్య నైవేద్యాల నిర్వహణ కొరకు వంటశాల ఫ్లోరింగ్ మరియు అవసరమైన సౌకర్యాల కల్పన.

గదుల మరమ్మతులు:

ఆలయ ప్రాంగణంలోని గదులకు అవసరమైన మరమ్మతులు చేసి భక్తుల వినియోగానికి అనుకూలంగా తీర్చిదిద్దడం.

భక్తుల సౌకర్యాల విస్తరణ
లాకర్ సౌకర్యం:

దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం లాకర్లు ఏర్పాటు.

వసతి గదులు:

భక్తులు రాత్రి బస చేసేందుకు తక్కువ వ్యయంతో సౌకర్యవంతమైన వసతి గదుల నిర్మాణం.

దిశ సూచిక బోర్డులు:

కామారెడ్డి, ఉప్పల్‌వాయి, మద్దికుంట, సిరికొండ తదితర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం దిశా సూచిక బోర్డుల ఏర్పాటు.

మౌలిక సదుపాయాల అభివృద్ధి
ప్రహరీ గోడ నిర్మాణం: ప్రథమ ప్రాధాన్యత

ఆలయ భద్రత, వాస్తు పరిరక్షణ దృష్ట్యా పడమర వైపున ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సిద్ధం చేయడం.

ఆలయ ప్రాంగణ అభివృద్ధి:

యూ (U) ఆకారంలో నిర్మాణాలు చేపట్టి ఆలయ ప్రాంగణాన్ని మరింత సుందరంగా, సౌకర్యవంతంగా అభివృద్ధి చేయడం.

కళ్యాణ మండపం:

ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం విశాలమైన కళ్యాణ మండప నిర్మాణం.

హై మాక్స్ విద్యుత్ దీపాలు:

ఆలయ పరిసరాల్లో నాలుగు దిక్కులా హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో తగిన వెలుతురు కల్పించడం.

గోశాల నిర్మాణం:

గోసంరక్షణకు అనువుగా ప్రత్యేక గోశాల నిర్మాణం.

ధ్యాన మందిరం:

భక్తులు ప్రశాంతంగా ధ్యానం, జపం చేసేందుకు ప్రత్యేక ధ్యాన మందిరం ఏర్పాటు.

సురక్షితమైన, పారదర్శకమైన ఇ-హుండీ సేవ

ఈ-హుండీ కానుకలు

మీ పేరు, సంప్రదింపు వివరాలు, కానుక మొత్తాన్ని నమోదు చేసి ఇ-హుండీ ద్వారా విరాళాన్ని సమర్పించండి.

చెల్లింపు ధృవీకరణ అనంతరం ఆలయ కమిటీ అధికారిక రసీదును అందజేస్తుంది.

Step– 01

దాత వివరాలు

పేరు, సంప్రదింపు వివరాలు మరియు విరాళం మొత్తాన్ని నమోదు చేయండి.

Step– 02

చెల్లింపు చేయండి

 QR కోడ్‌ను స్కాన్ చేసి UPI లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా విరాళాన్ని సమర్పించండి.

Step– 03

చెల్లింపు రుజువును సమర్పించండి

ధృవీకరణ కోసం చెల్లింపు రుజువును అప్‌లోడ్ చేయండి.